Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను సినిమాల్లోకి రావడానికి మా అమ్మ ఒప్పుకోలేదు!: సీనియర్ హీరోయిన్ లత

  • ఎంజీఆర్ సినిమాలో ఛాన్స్ వచ్చింది 
  • మా పెద్దమ్మ ప్రోత్సహించింది 
  • మా అమ్మను ఆయన ఒప్పించారు
అందాల కథానాయికగా ఒకప్పటి ప్రేక్షకులచేత మంచి మార్కులు కొట్టేసిన లత, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. తాను సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది చెప్పుకొచ్చారు. " నేను తొమ్మిదో క్లాస్ చదువుతూ ఉండగా స్కూల్లో ఒక డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాను .. ఆ ఫోటో ఎంజీఆర్ గారి కంటపడింది. ఆయన సూచన మేరకు ఆర్.ఎస్.మనోహర్ గారు మా అమ్మకు కాల్ చేశారు.

ఎంజీఆర్ సినిమాలోకి కొత్త హీరోయిన్ కావాలని వెతుకుతున్నారనీ .. నన్ను సినిమాల్లోకి తీసుకురమ్మని అడిగారట. 'మా అమ్మాయి చదివేది తొమ్మిదో క్లాస్ .. సినిమాల్లో చేయదు' అనేసి మా అమ్మ ఫోన్ పెట్టేసిందట. మా పెద్దమ్మ మాత్రం ఆ సినిమా చేయమని నన్ను ప్రోత్సహిస్తూ వచ్చింది. రెండు రోజుల తరువాత మనోహర్ గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎంజీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన మా అమ్మను ఒప్పించి .. నన్ను ఆ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. అలా ఆ సినిమాతో కథానాయికగా నా కెరియర్ మొదలైంది" అని అన్నారు. 
latha
ali

More Telugu News